పండుగలు సందర్భంగా అనేక టెలికాం కంపెనీలు వారి కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ఇలా జియో ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలు మొబైల్ రీఛార్జ్ లపై ఇప్పటికే అనేక ఆఫర్లను అందుబాటులో ఇక ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు శుభవార్త తెలియజేసింది. ఎయిర్టెల్ కస్టమర్ కు న్యూ ఇయర్ సందర్భంగా 50gb డేటా ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ అందుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఎయిర్టెల్ కస్టమర్లు కొత్త సంవత్సరం సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన 50 gb ఫ్రీ డేటా ఆఫర్ కి అర్హులు కావాలంటే వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది.వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ఎయిర్టెల్ కస్టమర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఎయిర్టెల్ సంస్థ ఆఫర్ చేస్తోంది. నెల రోజుల పాటు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ విలువ రూ. 149గా ఉంది. అయితే ఇప్పుడు కేవలం రూ. 98కే ఈ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఏడాది సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి 50 జీబీ డేటా ఉచితంగా వస్తుంది.ఇక ఏడాది వరకు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం.. రూ. 301 చెల్లించాల్సి ఉంటుంది.
అలా కాకుండా మీరు ఎయిర్టెల్ కొత్త కస్టమర్లు అయితే వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మొదటి నెల ఉచితంగానే పొందొచ్చు. ఈ కొత్త కస్టమర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం ద్వారా డేటా అవసరం లేకుండా ఫ్రీగానే సాంగ్స డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకొని యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా పాడ్‌కాస్ట్స్, లైవ్ షోస్ చూడొచ్చు. అపరిమిత స్ట్రీమింగ్ బెనిఫిట్ ఉంది. ఎక్స్‌క్లూజివ్ ప్లేలిస్ట్స్ ఉంటాయి. అందువల్ల మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లు అయితే ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్టెల్ కస్టమర్లు ఏడాది పాటు వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగానే 50 జీబీ వరకు డేటాను సొంతం చేసుకోవచ్చు.