కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!

దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోఎంతోమంది కష్టమర్లు ఉన్నారు. అయితే కస్టమర్లకు అనుగుణంగా ఇప్పటికే ఎస్బిఐ ఎన్నో సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం మరో శుభవార్తను తెలియజేసింది. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఓ శుభవార్తని చెప్పింది. క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందనే విషయానికి వస్తే..

ఎస్బిఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది . ఈ బ్యాంకు కస్టమర్ల కోసం కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ కార్డుల వివరాలు ఏంటి అనే విషయానికి వస్తే..ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్, పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డులని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం కస్టమర్లు కోసం ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ ని తీసుకు వచ్చారు.

పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డు ఉంటే రివార్డ్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఇలా ఈ కార్డుల ద్వారా కస్టమర్లు ఎంతో లాభం పొందవచ్చు. ఇక స్టేట్ బ్యాంకులో కొత్త కస్టమర్లను పొందడం కోసం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం ఉపయోగ పడుతుంది. ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో రామ మోహన్ తెలియజేశారు.