ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పిఎఫ్ ఖాతాదారులకు ఇటీవల ఒక శుభవార్త తెలియజేసింది. ఉద్యోగస్తుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు జమ చేయడం ప్రారంభించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వడ్డీ డబ్బుల వివరాల కోసం ఒక నెటిజన్ ప్రశ్నించగా … ‘వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే మీ ఖాతాల్లోకి పూర్తి వడ్డీ డబ్బు పడుతుందని’ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది. నెల రోజుల్లో పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ చేసే ప్రక్రియ పూర్తికానున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.
ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ 8.1 శాతంగా వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వడ్డీ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం. అయితే పీఎఫ్ ఖాతాలోకి జమ అయ్యే వడ్డీ డబ్బు బ్యాలెన్స్ ని మొబైల్ ఫోన్ నుండి చూసే అవకాశం కూడా ఉంది. ఇలా మీ ఖాతాల్లోకి జమ అయిన పిఎఫ్ డబ్బు వివరాలు తెలుసుకోవడానికి మొదటిది ఈపీఎఫ్ఓ అఫీషియల్ సైట్ సందర్శించి ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత పిఎఫ్ ఖాతాదారుడు మొబైల్ నెంబర్‌తో తన ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవటానికి 99660-44425, 011-22901406 టోల్ ఫ్రీ నెంబర్‌లకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కాల్ చేయాలి. ఇక ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి. . 7738299899 నెంబర్‌కు ”EPFOHO UAN ENG” అని ఎస్ఎంఎస్ పంపాలి. UAN ఉన్న చోట మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేయాలి. అనంతరం మెసేజ్ సెండ్ చేయండి.. ఇలా చేయటం వల్ల మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ సంబందించిన పూర్తి వివరాలు గురించి సమాచారం తెలుసుకోవచ్చు.