ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అమలులోకి తీసుకువస్తుంది. ప్రతి ఏటా ఎంతోమంది కష్టమర్లు ఎస్బిఐ అందిస్తున్న సేవల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు అనుగుణంగా ప్రత్యేక విధానాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న ఎస్బిఐ వచ్చే ఏడాది 2023 లో కూడా మరికొన్ని మార్పులు చేసి తన కస్టమర్లకు సేవలు చేయనుంది.
సాధారణంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డు ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. షాపింగ్ కు వెళ్లినా, లేదా ఆన్‌లైన్ షాపింగ్ చేసినా క్రెడిట్ కార్డు తో ఈజీ పేమెంట్ పద్ధతిని ఫాలో అవుతున్నాము. ఈ క్రమంలో అన్ని రకాల బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్ల తో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ అందించే క్రెడిట్ కార్డు ని కూడా చాలా మంది వాడుతున్నారు. చిన్న, మధ్య తరగతి వారు ఎస్ బీఐ సింప్లి క్లిక్ పేరు తో ఉన్న క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని లిమిట్ క్రెడిట్ స్కోర్ ని బట్టీ ఉంటుంది. రూ.15,000 లిమిట్ తో సింప్లి క్లిక్ కార్డులను తన కస్టమర్లకు ఎస్బిఐ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే ఈ కార్డుని ఉపయోగించే కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది అనగా జనవరి 2023 నుంచి ఎస్బిఐ క్రెడిట్ కార్డు పైఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఎస్బిఐ సింప్లీ క్లిక్ కార్డులకు సంబంధించిన వోచర్లు, రివార్డు పాయింట్ల రిడీమ్ కి రూల్స్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ మేరకు జనవరి 6, 2023 నుంచి ఎస్‌బీఐ సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లకు జారీ చేసే క్లియర్ ట్రిప్ వోచర్ ని ఎక్కువ సార్లు రీడిమ్ చేసుకునే వీలు లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకునే విధంగా రూల్ పెట్టింది. అంతేకాకుండా ఈ వోచర్ ఏ ఇతర వోచర్ల తోనూ, ఆఫర్లతోనూ కలిపి రాదు. ఇక జనవరి 01, 2023 నుంచి అమెజాన్ వెబ్ సైట్ లో ఈ కార్డు ని వాడితే వచ్చే రివార్డు పాయింట్లను కూడా తగ్గించేసింది. వచ్చే ఏడాది నుండి 10 రివార్డులకు బదులు కేవలం ఐదు పాయింట్లు వచ్చే విధంగా కొత్త రూల్స్ అమలులోకి తీసుకురానుంది.