దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో భద్రతల నేపథ్యంలో ఖాతాదారులకు ఎన్నో సేవలను అందిస్తోంది. అయితే డిజిటల్ లావాదేవీలలో ఎవరు మోసపోకుండా మరింత కట్టుదిట్టమైన సేవలను అందించడానికి సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. కొత్తగా ఇమెయిల్ ఓటీపీ ఆథెంటికేషన్ సర్వీస్ ప్రారంభించింది. ఎవరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపితే కస్టమర్ల రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కు ఓటీపీ నోటిఫికేషన్స్ వస్తాయి.
ఈ ఓటిపి సర్వీసు ద్వారా తమ లావాదేవీలను సురక్షితంగా మార్చుకోవచ్చు. ఖాతాదారులు వెంటనే రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌లకు ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయానికి వస్తే..కస్టమర్లు retail.onlinesbi.sbi వెబ్‌సైట్‌లో ఇమెయిల్ ఓటీపీ నోటిఫికేషన్స్‌నియాక్టివేట్ చేయొచ్చు. ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కు తప్పనిసరిగా ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ ఓటిపి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే..
* ముందుగా retail.onlinesbi.sbi వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
*నెట్ బ్యాంకింగ్ కోసం మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
*ఆ తర్వాత ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి హై సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
*ఇలా క్లిక్ చేయగానే మనకు ఎస్ఎంఎస్ కోసం అలాగే ఈ మెయిల్ కోసం సపరేట్ ఓటీపీలు ఉంటాయి. మీరు మెయిల్ ఐడి ఓటిపి కోసం యాక్టివేట్ చేస్తున్నారు కనుక మెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఓటిపి ఆక్టివేట్ అవుతుంది.
*ఇలా యాక్టివేట్ అయిన అనంతరం మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటారు ఆ ఫోన్ నెంబర్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.