దేశానికి రైతులు వెన్నెముక లాంటివారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందువల్ల రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రూపొందించి ఆ పథకాల ద్వారా రైతులను ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా రైతులను ఆదుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇక తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రైతులకు శుభవార్త తెలియజేసింది.
పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ లోన్ యోజన పథకం కింద రైతులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 50 వేల రుణాన్ని ఇస్తుంది. రైతన్నల ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ ఈ రుణాన్ని మంజూరు చేయనుంది. ఈ రుణం మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో పడేలా సన్నాహాలు చేసింది. పిఎన్ బి కిసాన్ తత్కాల్ లోన్ యోజన ద్వారా రైతులు గరిష్టంగా 50 వేల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. పైగా రైతులు ఈ ఋణాన్ని పొందటానికి ఎటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పిఎన్బి కిసాన్ యోజన ద్వారా రుణాన్ని పొందటానికి రైతులు కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ రుణాన్ని తీసుకోవటానికి సొంత భూమి ఉన్న రైతులు మాత్రమే కాకుండా కవులు రైతులు కూడా అర్హులు. ఒక్కొక్క రైతు మాత్రమే కాకుండా కొంతమంది రైతులు గ్రూపులుగా ఏర్పడి ఈ లోన్ తీసుకొని అవకాశం కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కల్పించింది. ఈ లోన్ తీసుకోవడానికి రైతు వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. కానీ ఈ రుణం తీసుకోవాలని భావిస్తున్న రైతులు గత రెండేళ్లు గా ఏమైనా లోన్ ని తీసుకుంటే ఆ లోన్ సరిగ్గా కడుతూ ఉండాలి. రుణ పరిమితిలో 25 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 50 వేల వరకు లోన్ ని పొందొచ్చు. రైతులు ఈ రుణాన్ని పొందటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి నేరుగా లోన్ తీసుకోవచ్చు.