పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 240 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. pnbindia.in అనే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. మే నెల 24వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
మొత్తం 240 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆఫీసర్ క్రెడిట్, ఆఫీసర్ ఇండస్ట్రీ, ఆఫీసర్ సివిల్ ఇంజనీర్, ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆఫీసర్ ఎకనామిక్స్, ఆఫీసర్ ఆర్కిటెక్చర్, మేనేజర్ ఎకనామిక్స్, మేనేజర్ డేటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.
అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1180 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 59 రూపాయలుగా ఉంది.