నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు!

ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు శాఖల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1025 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఫిబ్రవరి నెల 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో లేదా ఏప్రిల్ నెలలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను ఆన్ లైన్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఆఫీసర్-క్రెడిట్ ఉద్యోగ ఖాళీలు 1000 ఉండగా మేనేజర్-ఫారెక్స్ పోస్టులు 15 ఉన్నాయి.

సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా మేనేజర్-సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు సైతం 5 ఉన్నాయి. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈ, ఎం.ఈ, సీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో ఉద్యోగ ఖాళీకి ఒక్కో విద్యార్హత ఉంది. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 36,000 రూపాయల నుంచి 78,230 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.