ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నరు. ఈ క్రమంలో ప్రముఖ
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ కూడా సరికొత్త ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇలా ప్రజల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో కొత్త బ్యాండ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఒప్పో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తోంది. ఇక తాజాగా ఒప్పొ రెనో 8 అనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పేరుతో కొత్త డివైజ్‌ను ఫిబ్రవరి 3న లాంచ్ చేసినట్టు ఒప్పో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒప్పో విడుదల చేయనున్న ఈ ఒప్పొ రెనో 8టీ ఫ్లిప్‌కార్ట్ , ఒప్పొ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక షైనీ గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ వేరియంట్ లలో లభించనున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ ఫోన్ ధర రూ.30,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ఒప్పొ రెనో 8టీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల మైక్రో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 67W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,800mAh బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉంటుంది.
ఇక ఒప్పొ రెనో 8 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ ని కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ చేస్తే 9 గంటల పాటు వీడియో స్ట్రీమ్ అందిస్తుంది. ఇక ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ కెమెరా, స్లిమ్ బెజెల్స్ కోసం డిస్‌ప్లేలో సెంట్రల్లీ అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. అంతే కాకుండా ఈ ఫోన్ డిస్‌ప్లే కూడా 93 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఇలా ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లేపై ఒప్పో ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 3 వ తేది నుండి ఒప్పో అఫిషియల్ వెబ్ సైట్ లో పాటు ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంది.