యూట్యూబ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్స్..?

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వాడకం పెరగటం వల్ల సోషల్ మీడియా యాప్స్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ పై యూట్యూబ్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏ విషయం గురించి అయినా చిన్న సందేహం వచ్చినా కూడా ఆ విషయాన్ని గురించి తెలుసుకోవటానికి గూగుల్ లేదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. ఇలా రోజురోజుకీ యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా యూ ట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో యూ ట్యూబ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఓ ప్రత్యేకమైన అప్ డేట్ ని ఇటీవల పరిచయం చేసింది

“రేడియో బిల్డర్” పేరిట యూట్యూబ్ ఈ సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది . ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం .

గూగుల్ అభివృద్ధి చేసిన యూ ట్యూబ్ లో యూ ట్యూబ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు యూ ట్యూబ్ మ్యూజిక్ లోనే రేడియో బిల్డర్ అనే కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన జోనర్ లో పాటలను అన్ని ఒక దగ్గర చేర్చుకొని స్టేషన్ తయారు చేసుకోవచ్చు. దీనిని గత మంగళవారం యూ ట్యూబ్ లో ఆవిష్కరించారు. యూ ట్యూబ్ లోని యూ ట్యూబ్ హోమ్ పేజీపై యువర్ మ్యూజిక్ టెనర్ సెక్షన్ లో ఈ రేడియో బిల్డర్ ఫీచర్ ని మనం గుర్తించవచ్చు. ఇక ఈ సరికొత్త ఫీచర్ ప్రత్యేకతల విషయానికి వస్తే..

•తాజాగా యూట్యూబ్ ప్రవేశపెట్టిన ఈ రేడియో బిల్డర్ ఫీచర్ తో మీరు 30 వరకూ ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకొని వారి పాటలు ప్లే అయ్యేటట్లు చేసుకోవచ్చు.
• అలాగే వారు ఎంపిక చేసుకున్న ఆర్టిస్ట్ ల పాటలు మాత్రమే కాకుండా ఇతర ఆర్టిస్ట్ ల పాటలు వినాలన్నా కూడా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి.
• ఈ రేడియో బిల్డర్ అప్ డేట్ లో మీరు ఎంపిక చేసుకున్న ప్లే లిస్ట్ కి ఫిల్టర్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
• దీనిలో చిల్, డౌన్ బీట్, పంప్ అప్ వంటి కేటగిరీల్లో సాంగ్స్ ని ఫిల్టర్ చేసుకొని ప్లే లిస్ట్ సెట్ చేసుకోవచ్చు.
• మీరు రేడియో స్టేషన్ క్రియేట్ చేయాలంటే యూ ట్యూబ్ మ్యూజిక్ లోకి వెళ్లి మొదట దీనిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ రేడియో ఆప్షన్ ని ఎంపిక చేసుకొని ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ ఫీచర్ ని ఎక్కడి నుంచైనా, ఎవరైనా వినియోగించుకోవచ్చు.
• యూ ట్యూబ్ పెయిడ్ సబ్ స్క్రైబర్స్, అలాగే ఫ్రీ యూజర్లు కూడా దీనిని వినియోగించుకోవచ్చు.