ప్రముఖ మెసేజింగ్ ఆప్ వాట్సప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్ ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ తరచూ సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూ తన కస్టమర్స్ ని పెంచుకుంటుంది. ఇలా సోషల్ మెసేజింగ్ యాప్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. అయితే ఈ వాట్సాప్ కు పోటీ ఇచ్చేందుకు టెలిగ్రామ్ సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మరోసారి టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ప్రస్తుతం టెలిగ్రామ్ సంస్థకు ఒక్క ప్లేస్టోర్ లోనే 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్లు ఉన్నాయి. 4.2 రేటింగ్ తో 11 మిలియన్ రివ్యూలతో దూసుకుపోతోంది. అయతే ఇప్పుడు టెలిగ్రామ్ కొన్ని సరికొత్త అప్ డేట్లు, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఏమోజీలు, ప్రొఫైల్ ఫొటో మేకర్, చాట్ ట్రాన్స్ లేటర్ అంటూ కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ప్రొఫైల్ పిక్చర్ మేకర్ కోసం దాదాపుగా పది లక్షలకు పైగా ఏమోజీలను టెలిగ్రామ్ అందుబాటులో ఉంచింది. ప్రొఫైల్ పిక్చర్ మేకర్ ఆప్షన్ తో.. యూజర్స్ తమ ఫోటో ని ఏదైనా యానిమేటెడ్ స్టిక్కర్, లేదా ఏమోజీ సాయంతో ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసుకోవచ్చు.
ఇంక ప్రొఫైల్ పిక్చర్ కూడా మెటా సంస్థ అవతార్ అని తీసుకొచ్చినట్లుగా టెలిగ్రామ్ కూడా యానిమేటెడ్ ఫీచర్ తో ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అంటూ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.అంతే కాకుండా మన చాటింగ్ ని ట్రాన్స్‌లేట్ చేసే ఫీచర్ ని కూడా టెలిగ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఏదైనా చాట్ చేస్తున్నప్పుడు ఆ చాట్ మొత్తాన్ని సెలక్ట్ చేసుకుని ట్రాన్స్ లేట్ చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. టైప్ చేసిన తర్వాత పైన ట్రాన్స్ లేట్ ఎంటైర్ చాట్ అనే ఆప్షన్ ఉపయోగించి చాట్ మొత్తాన్ని ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ను కేవలం ప్రీమియం వినియోగదారులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవటానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చి వాట్సప్ కి పోటీగా నిలుస్తోంది.