వాట్సప్ వినియోగదారులకు శుభవార్త..ఇక పై వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్స్…?

సోషల్ మెసేజ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విస్తరించి వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది . ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన వాట్సప్ ఇప్పటికే 5 బిలియన్ ప్లస్‌ డౌన్లోడ్స్ దూసుకుపోతోంది. ఇప్పటికే వాట్సప్ ద్వారా చాటింగ్, షేరింగ్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక వాట్సప్ తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త కొత్త ఫీచర్స్ ని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చాలా మంది దీనిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా.. వ్యాపార అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. అందుకోసం వాట్సాప్ బిజినెస్ అని కూడా తీసుకొచ్చారు. వాట్సాప్ తమ వినియోగదారుల కోసం తరచూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. మిగిలిన మెసేజింగ్ యాప్స్ తో పోటీ పడేందుకు కూడా వాట్సాప్ సరికొత్త ఫీచర్లను, అప్ డేట్లను తీసుకొస్తుంటుంది.

తాజాగా వాట్సాప్ నుంచి మరి కొన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ లో ఉన్న మీడియా షేరింగ్ ఫీచర్ వల్ల వినియోగదారులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ఈ మీడియా షేరింగ్ అందరికీ పెద్ద రిలీఫ్ ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో వాట్సాప్ ద్వారా మీరు కేవలం 30 ఫొటోలను మాత్రమే షేర్ చేసే అవకాశం ఉండేది. కానీ, ఇప్పటి నుంచి మీరు వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 ఫొటోల వరకు షేర్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి 100కు పైగా ఫోటోలను షేర్ చేసి వారి సమయాన్ని వృధా కాకుండా కాపాడవచ్చు.