సరికొత్త ఫీచర్స్ తో టెలిగ్రామ్ కి షాక్ ఇచ్చిన ఇన్స్టాగ్రామ్…?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి వాట్స్అప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఆప్స్ లో అకౌంట్లు ఉంటున్నాయి. ఈ సోషల్ మీడియా ఆప్స్ ద్వారా వారి రోజు వారి జీవితంలో జరిగే సంఘటనల గురించి షేర్ చేస్తూ ఉండటమే కాకుండా వారిలో ఉన్న ప్రతిభని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ లో ఇన్ స్టాగ్రామ్ ని ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు. మెటా సంస్థకు చెందిన ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ తమ వినియోగదారులను అలరించేందుకు వారికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇన్ స్టా రీల్స్‌ పేరిట నగదు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ కంటెట్‌ క్రియేటర్లకు ఎంతో ప్రాధాన్యం కూడా ఇస్తోంది. వారి కోసం అప్ డేట్స్, ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ తాజాగా క్రియేటర్ల కోసం బ్రాడ్ కాస్టింగ్ కు సంబంధించి ఛానల్స్‌ పేరిట బ్రాడ్ కాస్టింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు కొన్ని ఛానల్స్ ను క్రియేట్ చేయచ్చు.

ఈ ఛానల్స్ ద్వారా క్రియేటర్లు వారి ఫాలోవర్స్ తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో ఇన్ఫర్మేషన్ శేర్ చేయటానికి వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫొటోలు, వాయిస్ నోట ద్వారా ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వవచ్చు. అంతే కాకుండా అభిమానులు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఈ ఛానల్స్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్ లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో ఛానల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ లో లాగా క్రియేటర్లు చేసే ఈ ఛానల్స్ లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అయితే మీకు నచ్చిన మెసేజ్ కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు.మీరు ఒకసారి ఛానల్ లో చేరితే అది మీ డీఎం సెక్షన్ లో అన్ని చాట్స్ మాదిరిగానే కనిపిస్తుంది.