Nubia Flip 5G: తక్కువ ధరకే ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోతూనే ఉంది. దీంతో వినియోగదారుల కోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు ఆయా స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇకపోతే మీరు కూడా బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ మి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా.

అది కూడా ఫోల్డ్ బుల్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఇది మీకోసమే. కాగా నుబియా అనే స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ తాజాగా గ్లోబల్‌ మార్కెట్లోకి నుబియా ఫ్లిప్‌ పేరుతో ఫోల్డబుల్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత తక్కువ బడ్జెట్‌ ఫోల్డబుల్ ఫోన్‌ ఇదే కావడం విశేషం. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,500 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 38,000, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 42,600గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

కాగా ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించారు. 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4310 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్లో 6.9 ఇంఎస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. 1,188 x 2,790 పిక్సెల్స్‌ రిజల్యూజన్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో సర్క్యూలర్‌ కెమెరా మోడల్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వరకు ఇందులో ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై, బ్లూటూత్‌ 5.2, ఎన్‌ఎస్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.