వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..గూగుల్ మీట్, జూమ్ కాల్ కు పోటీగా వాట్సప్ కాల్ లింక్..?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ రోజు రోజుకి కొత్త ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వాట్సప్ కు పోటీగా గూగుల్ లాంటి సంస్థలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పోటీని తట్టుకునేందుకు కాల్ లింక్స్ పేరిట వాట్సప్ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఇప్పటికే మెసేజ్ కాలింగ్ షేరింగ్ వంటి ఎన్నో ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకున్న వాట్సాప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది, ఇది ఇప్పుడు Android వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే, దీని సహాయంతో, Google Meet లాగా గ్రూప్ చాట్ లింక్ లేదా వీడియో చాట్ లింక్‌ని సృష్టించవచ్చు. దీని సహాయంతో కాల్‌లో చేరడానికి వ్యక్తులను ఆహ్వానించవచ్చు. WABetaInfoa నివేదిక ప్రకారం, గ్రూప్ కాల్‌లో చేరడానికి iOS, Android వినియోగదారుల కోసం లింక్‌లను సృష్టించే ఫీచర్‌ను వాట్సప్ యాప్ విడుదల చేసింది. ఇంతకుముందు, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ కోసం లింక్‌ను సృష్టించినప్పుడు, మీరు వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ అటెండ్ చేయాలి అనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చెసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కాల్‌లో చేరినప్పుడు, కాల్ ఆటోమేటిగ్గా గ్రూప్ కాల్‌కి మారుతుంది . వాట్సప్ లో ఈ కొత్త ఫీచర్ కాల్ ట్యాబ్ ఎగువన మనం చూడవచ్చు. యూజర్లు “క్రియేట్ కాల్ లింక్” అనే కొత్త ఆఫ్షన్ అప్ డేట్ ద్వారా లభిస్తుంది. అలాగే వారి విండోస్ అప్ డేట్ ద్వారా కూడా లభిస్తోంది. యూజర్లు కాల్‌లో చేరడానికి వ్యక్తులను ఆహ్వానించినప్పుడు వారి ఫోన్ నంబర్‌లు లింక్‌లో కనిపిస్తాయి. అయితే ఒకేసారి క్రియేట్ చేసిన ఈ లింక్‌లను 90 రోజుల పాటు ఉపయోగించవచ్చు.