క్రోమాలో కొత్త సంవత్సరం ఆఫర్లు… మొబైల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు..?

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్రత్యేక ఆఫర్లు ప్రజల ముందుకు తీసుకు వస్తున్నాయి. ఈ క్రమంలో టాటా కంపెనీకి చెందిన క్రోమా.. ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్, న్యూ ఇయర్ సేల్‌ను లాంచ్‌ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త వస్తువులు కొనాలనుకునే వారికి అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. హౌస్ హోల్డ్స్, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు వంటి వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. క్రోమా అందిస్తున్న టాప్‌ డీల్స్‌పై చూసేద్దాం రండి.

ప్రస్తుతం క్రోమా.. ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ న్యూ ఇయర్ సేల్ లో భాగంగా కస్టమర్లు క్రోమా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నుంచి లేదా క్రోమా రిటైల్ స్టోర్‌ల నుంచి సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో రెడ్, గ్రీన్, వైట్ కలర్స్‌లో డిస్కౌంట్ మోడల్ పరిచయం చేసింది. ఒక్కో కలర్‌ ఒక్కో రేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తోంది. రెడ్ కలర్ మీద 10 %, గ్రీన్ కలర్ మీద 5 % , వైట్ కలర్ మీద 3 % డిస్కౌంట్‌ ఇస్తోంది. క్రోమా స్టోర్‌లో షాపింగ్ చేసి లక్కీ డ్రా విన్ అయిన వారికి వీటిని అందిస్తు.. ఈ ఆఫర్లను రెండు విడతల్లో రీడీమ్ చేసుకోవచ్చు. మొదటి విడత డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఉంది. రెండో విడత డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు ఉంది.

క్రోమా అందిస్తున్న ఈ న్యూ ఇయర్ డీల్ లో రూ.20,999 విలువ గల రియల్‌ మీ 9 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.16,999కి కొనుగోలు చేయవచ్చు. ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌లపై కస్టమర్లు అదనంగా రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 6.4 ఇంచ్ సూపర్ AMOLED FHD+ డిస్‌ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

అలాగే రూ. 64,900 విలువచేసే యాపిల్ ఐఫోన్ 12 ని కేవలం రూ.58,900కి సొంతం చేసుకోవచ్చు. HDFC క్రెడిట్ కార్డ్‌ ట్రాన్సాక్షన్‌లపై రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. యాపిల్ ఐఫోన్ 12 అనేది యాపిల్ 14 బయోనిక్ చిప్స్ సెట్, IOS 14తో పనిచేస్తుంది. ఈ ఫోను కొత్త iOS 16 అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. దీంతో స్క్రీన్ లాక్, బ్యాటరీ ఇండికేటర్ వంటి ఇతర ఫీచర్లు లభిస్తాయి. 6.1-ఇంచ్ OLED సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేతో, సిరామిక్‌ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ అందిస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్స్‌తో వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రెసిస్టెంట్‌గా ఉంది. ఐఫోన్ 12 వెనుక 12 mp డ్యూయల్ కెమెరా సెన్సార్ ఉంటుంది.