ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్ ల వాడకం రోజురోజుకీ కరిగిపోతోంది. కొంతమంది ఒకటి కాదని ఏకంగా రెండు మొబైల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. ఈ క్రమంలో చాలామంది నిత్యం సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాలలో మొబైల్ ఫోన్ పేలిన ఘటనలు కూడా చాలా తెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో కూడా ఇటువంటి ఘటన పూర్తి చేసుకుంది. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయిన మహిళ.. ఫోన్ పేలటంతో అక్కడికక్కడే మృతి చెందింది.
వివరాలలోకి వెళితే… ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల మంజీత్ ఆంటీ సెల్ ఫోన్ పేలిన ఘటనలో మరణించినట్లు అతను వెల్లడించాడు. ప్రమాదానికి గురైన సదరు మహిళ రాత్రి నిద్రించే సమయంలో సెల్ ఫోన్ దిండు వద్ద ఉంచుకొని నిద్రపోయింది. అర్ధరాత్రి సమయంలో సెల్ఫోన్ పెట్టడంతో తలకు తీవ్రంగా గాయాలయి రక్తం స్రావం ఎక్కువగా అవటం వల్ల ఆ మహిళా మరణించినట్లు మంజీత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
ఈ క్రమంలో ఆమె ఉపయోగించిన ఫోన్ పేలిన ఫోటోలతో పాటు రక్తపు మడుగులో ఉన్న తన ఆంటీ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధిత మహిళ రెడ్‌మీ 6ఏ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అతను వెల్లడించాడు. అయితే ఈ ప్రమాదం పట్ల రెడ్‌మీ కంపెనీ బాధ్యత వహించాలని అతను డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టినట్లు రెడ్‌మీ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.