దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు. ప్రతిరోజు రైతన్నలు కష్టపడితే గాని మనకు తినటానికి తిండి లభిస్తుంది. అయితే అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతన్నలు చాలా నష్టపోతున్నారు. అందువల్ల అప్పులు చేసి మరీ పంటలు పండించడానికి పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పతకాలను అమలులోకి తీసుకువచ్చాయి. ఈ పథకాల ద్వారా అర్ రైతులకు పెట్టుబడిలో వచ్చిన నష్టాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవడానికి పీఎం కిసాన్ యోజన అనే ఒక పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
ఈ పథకం ద్వారా ప్రత్యేక అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇప్పటికె పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ప్రత్యేక రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రతి ఏటా నాలుగు దశలలో 3000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా దూసుకుపోతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారల ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
2023 బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఏటా వచ్చే రూ.6,000 మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఈ బడ్జెట్‌లో ఈ పథకం మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఏడాదికి 4 విడతలుగా 2 వేల రూపాయల చొప్పున రైతులకు ఈ మొత్తాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన విడుదల కానుందని తెలుస్తోంది.