ఈ 3 పనులు చేస్తేనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. మోదీ సర్కార్ శుభవార్త ఇదే!

farmers-sixteen_nine

సమాజంలో రైతులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడి పంటలను పండించి అందరికీ కడుపు నింపుతుంటారు. కాబట్టి అటువంటి రైతు ఎప్పుడు కష్టాలు పడొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా మోదీ సర్కార్ రైతులకు ఒక శుభవార్త అందించింది. ఇప్పటికే పీఎం కిసాన్ రైతులకు డబ్బు పరంగా 13 విడతల రూపంలో సహాయం చేస్తూ వచ్చింది.

 

అయితే తాజాగా 14వ విడత కూడా విడుదల చేసింది. ఇక ఈ విడత కింద డబ్బు పొందాలి అంటే కచ్చితంగా మూడు పనులు చేయాల్సిందే అని తెలిపింది. ఇప్పటికే పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ కావాల్సి ఉండేది. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయలేదని తెలిసింది.

 

కానీ తాజాగా అందిన విషయం ప్రకారం 14వ విడత డబ్బులు వచ్చే వారంలో రైతుల బ్యాంకు ఖాతాలలో జమ కావచ్చు అని తెలుస్తుంది. అయితే ఈ డబ్బులు జమ కావాలి అంటే రైతులు కచ్చితంగా మూడు పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే రైతులు కచ్చితంగా ల్యాండ్ డాక్యుమెంట్లను పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

 

ఆధార్ కార్డును యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. అలా ఈ మూడు పనులు చేస్తే 14వ విడత డబ్బులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇక ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 2000 చొప్పున విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటాయి.