మన భారత దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఈ ఆధార్ కార్డ్ ద్వారా దేశంలో మనకు గుర్తింపు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి పనికి ఆధార్ కార్డు చాలా అవసరం. ఇక ఇటీవల ఆధార్ కార్డు ని ఓటర్ ఐడి తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓటర్ ఐడి తో ఆధార్ కార్డు అనుసంధానం చేయడానికి కొంతమంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చిటికెలో ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో లింక్ చేయవచ్చు. ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• ఓటర్ ఐడి ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి ఆధార్ కార్డ్ నంబర్, ఓటర్ ఐడి వివరాలను అందిస్తే ఓటర్ ఐడి తో ఆధార్ కార్డ్ అనుసంధానం చేయబడుతుంది.
ఆన్‌లైన్ లింక్ :
• ఓటర్ ఐడిని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి ముందుగా వెబ్‌సైట్ https://nvsp.in/ లో లాగిన్ అవ్వాలి.
• వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత లాగిన్‌పై క్లిక్ చేసి.. ఇక్కడ మీరు కొత్త వినియోగదారుగా నమోదు చేసుకునే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
• ఆ తర్వాత అక్కడ మీరు మొబైల్ నంబర్, క్యాప్చాను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
• అక్కడ మీరు ఓటీపీని నమోదు చేసిన వెంటనే కొత్త పేజీ తెరవబడుతుంది.
• ఆ తర్వాత అక్కడ అడిగిన అన్ని వివరాలను అందించాలి. దానిని సమర్పించిన తర్వాత, మీ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది.
• మొత్తం సమాచారాన్ని సమర్పించిన తర్వాత, ఆటోమేటిక్ రసీదు సంఖ్య జనరేట్ చేయబడుతుంది.
మీ ఓటరు ID ఆధార్‌తో లింక్ చేయబడిందా లేదా అనే విషయాన్నీ మళ్ళి మనం ట్రాక్ చేసుకోవాలి.
• ఓటర్ ఐడి తో ఆధార్ కార్డు అనుసంధానం అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది.