వాట్సప్ సేవలను ప్రారంభించిన ఎల్ఐసి… ఫోన్ ద్వారానే ఈ సేవలను పొందవచ్చు!

భారతదేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎల్ఐసి ఛైర్మన్ ఎంఆర్ కుమార్ ఇకపై వాట్సాప్ ద్వారానే ఎల్ఐసి సేవలను ప్రారంభించనున్నట్టు ఎల్ఐసి హోల్డర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం పది సేవలను మాత్రమే ఫోన్ ద్వారా ఎల్ఐసి భీమా దారులకు సేవలను అందించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. మరి వాట్సాప్ ద్వారా ఎలాంటి సేవలను అందించనున్నారు అనే విషయానికి వస్తే…

ప్రీమియం డ్యూ, బోనస్ సమాచారం, పాలసీ స్టేటస్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్ ,లోన్ రీపేమెంట్ కొటేషన్,
రుణ వడ్డీ బకాయి, ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్,
ULIP – యూనిట్స్ స్టేట్‌మెంట్, LIC సేవల లింక్స్ ఈ పది సేవలను వాట్సాప్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సేవలు అందరికీ వర్తించవని ఎవరైతే ఎల్ఐసి పోర్టల్ లో మీ పాలసీని రిజిస్టర్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఎల్ఐసి పోర్టల్ లో రిజిస్టర్ చేయించుకోవడం కోసం ఆధార్ కార్డ్ ఎల్ఐసి పాలసీ నెంబర్లు పాన్ కార్డు పాస్పోర్ట్ వంటి డాక్యుమెంట్స్ కావాలి. మరి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం..

*ముందుగా www.licindia.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత Customer Portal ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.

*ఇలా క్లిక్ చేయగానే న్యూ యూజర్ ఐడి క్లిక్ చేసి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.

*యూజర్ ఐడి జనరేట్ అయిన తర్వాత లాగిన్ కావాలి.
లాగిన్ అయ్యాక Basic Services లో Add Policy పైన క్లిక్ చేయాలి.అనంతరం మీ ఎల్ఐసి పాలసీలన్నీ కూడా ఇందులో యాడ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే పై తెలిపిన 10 సేవలను మీరు ఇంటి నుంచే పొందవచ్చు.