ఆధార్ పొంది పదేళ్లవుతుందా… వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైనది.పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఆధార్ గుర్తింపు కార్డు ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైనటువంటి పథకాలకు లబ్ధిదారులు కావాలన్నా లేదా ఇతర పథకాలు పొందాలన్నా ఆధార్ ఎంతో కీలకంగా మారింది.అయితే ఆధార్ కార్డులో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పేరు చిరునామా తప్పుగా ఉండడం లేదంటే ఫోటో అప్డేట్ కాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు వెంటనే ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా మీరు ఆధార్ కార్డు పొంది పదేళ్లు అవుతున్నవెంటనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. మరి ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే…. మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ పేరు వివరాలు, చిరునామా ఫోటో అప్డేట్ ఉన్నవాళ్లు అప్డేట్ తప్పనిసరి కాదు అయితే ఎవరికైతే ఆధార్ లో తప్పులు ఉంటాయో అలాంటివారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇకపోతే ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తప్పనిసరిగా ఏదో ఒక గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం UIDAI 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అంగీకరిస్తుంది. వాటిపై ఫోటో పేరు తప్పనిసరిగా ఉండాలి మరి ఆ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి వస్తే.. పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఇ పాన్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఎస్ఎస్ సి మార్క్స్ కార్డ్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్ కార్డుల ద్వారా మనం ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.