ఏటీఎం కార్డు సైజులో ఉన్న ఆధార్ పీవీసీ కార్డ్ పొందటానికి ఇలా చేస్తే సరి…?

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వపరంగా మాత్రమే కాకుండా ఇతర పనులు పూర్తి చేసుకోవటానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డు ని ఒక మనిషికి గుర్తింపుగా భావిస్తారు. ఇలా ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆధార్ కార్డు ని ప్రతి ఒక్కరూ తమ వింటే ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి సందర్భాలలో పెద్దగా ఉన్న ఆధార్ కార్డుని తమతో తీసుకెళ్లటానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఏటీఎం కార్డ్ సైజ్‌లో ఆధార్ కార్డును ముద్రించి ఇస్తోంది. ఈ మినీ ఆధార్ కార్డ్ ని ఆధార్ పీవీసీ కార్డ్ (Aadhaar PVC Card) అంటారు.

ఈ ఆధార్ పివిసి కార్డులో ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉన్నట్టే క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్‌ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ డేట్, ప్రింట్ డేట్, ఎంబాస్డ్ ఆధార్ లోగో వంటి వివరాలు ఉంటాయి . ఈ ఆధార్ పీవీసీ కార్డ్ కూడా ఒరిజినల్ ఆధార్ కార్డులా పని చేస్తుంది. అయితే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసి ఆధార్ పీవీసీ కార్డ్ పొందవచ్చు. ఈ కార్డ్ కోసం రూ.50 నామినల్ ఛార్జీ చెల్లిస్తే చాలు, పీవీసీ ఆధార్ కార్డ్ ఇంటి అడ్రస్‌కు వచ్చేస్తుంది.

రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ ఆర్డర్ చేసే విధానం :

• ముందుగా https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

• ఆ తర్వాత Order Aadhaar Card పైన క్లిక్ చేయాలి.

• ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఎంటర్ చేయాలి.

• సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేయాలి.

• ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసి, పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి.

నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ :

• ముందుగా https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Order Aadhaar Card పైన క్లిక్ చేయాలి.

• ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఎంటర్ చేసి ..సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేయాలి.

• ఆ తర్వాత If you do not have a registered mobile number బాక్స్ టిక్ చేసి ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

• ఆ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

• ఆ తర్వాత ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి.