సెక్యూరిటీ కోసం ఇంట్లో సీసీ కెమెరా పెట్టే అవసరం లేకుండా మీ పాత ఫోన్ తో ఇలా చేస్తే సరి?

ప్రస్తుత కాలంలో దొంగతనాల రేటు రోజురోజుకి పెరిగిపోతుంది అందువల్ల పిల్లల్లో దుకాణాలలో భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చటం తప్పనిసరిగా మారిపోయింది. అయితే సీసీ కెమెరాలు అమర్చడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క సీసీ కెమెరా అమరచడానికి దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం ఇంట్లో అంత ఖర్చు చేసి సీసీ కెమెరా అమచకుండానే పాత మొబైల్ ఫోన్ ద్వారా నిత్యం మన ఇంటి భద్రతను నిత్యం పర్యవేక్షించవచ్చు. అవునండి.. మీరు వింటున్నది నిజమే. పాత మొబైల్ ఫోన్ ని సీసీ కెమెరాగా ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇందుకోసం మీ పాత ఫోన్ ని సీసీటీవీ కెమెరా లాగా ఉపయోగించవచ్చు. అలాగే మీ వద్ద ఉన్న కొత్త ఫోన్ ని మానిటర్ లాగా ఉపయోగించవచ్చు. ఇలా మీ వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగించి రెండింటిలో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఇంటిని నిత్యం పర్యవేక్షించవచ్చు. రెండు ఫోన్లలోనూ సెక్యూరిటీ కెమెరా యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంటే ఇలాంటి సెక్యూరిటీ కి సంబంధించిన చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో గూగుల్ వెరిఫైడ్ యాప్ ఏదేని ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని, ఈ యాప్ ద్వారానే మీ పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుంది.

పాత మొబైల్ ఫోన్ ని సీసీ కెమెరా లాగా ఎలా ఉపయోగించాలంటే.. ఉదాహరణకు రెండు ఫోన్లలోనూ Alfred CCTV Camera అనే ఒక సెక్యూరిటీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దీనికి గూగుల్ ఖాతా ద్వారా సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ అయ్యాక.. ఒకదానిలో ‘కెమెరా’, మరొక దానిలో ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు మీ పాత ఫోన్‌ను ఇంట్లో ఒక చోట అమర్చాలి. ఈ ఫోన్‌కు నిరంతరం ఇంటర్నెట్‌ కనెక్షన్ ఇవ్వాలి. అలాగే, ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఛార్జింగ్ కనెక్ట్ చేయాలి. ఇక ఇప్పుడు ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ఎంచుకున్న ఫోన్ ద్వారా మీరు ఇంటికి దూరంగా ఉన్నా కూడా నిరంతరం మానిటర్ చేయవచ్చు.