సుమ సెక్యూరిటీ కోసం ఆమె చుట్టూ ఎనిమిది మంది ఉంటారట?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె డేట్స్ కోసం హీరోలు సైతం ఎదురు చూసే అంత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఏదైనా సినిమా ఈవెంట్ జరిగింది అంటే అక్కడ తప్పకుండా సుమా ఉండాల్సిందే. ఈ విధంగా యాంకర్ గా బుల్లితెరపై వివిధ టీవీ కార్యక్రమాలలో సందడి చేసిన సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలో సుమ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే సుమకు సంబంధించిన ఒక రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా సుమ తన దగ్గర ఎంత మంది సెక్యూరిటీగా ఉంటారు అనే విషయం గురించి వెల్లడించారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీల కోసం ఎంతో మంది సెక్యూరిటీ ఉంటారు. అలాగే యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కోసం కూడా ఏకంగా ఎనిమిది మంది సెక్యూరిటీ ఎప్పుడూ తనతోనే ఉంటారని వెల్లడించారు.

ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఒక డ్రైవర్, అకౌంటెంట్, మేకప్ మెన్, డిజైనర్, హెయిర్ స్పెషలిస్ట్, న్యూట్రిషనిస్ట్, జిమ్ ట్రైనర్ ఇలా ఎంతోమంది వారి కోసం ప్రత్యేకంగా పని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా సుమ చుట్టూ ఎల్లప్పుడు ఎనిమిది మంది ఉంటారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే సుమ ఎంత బిజీగా ఉంటారు, ఈమెకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఇక బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ వెండితెరపై గుర్తింపు పొందుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.