విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించిన సంగతి తెలిసిందే. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా గ్యాస్ భారిన పడ్డ కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించారు. స్టైరీన్ బాధిత గ్రామాల్లో ఒక్కో సభ్యుడికి పదివేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తుంది. అలాగే వైద్య పరీక్షలు అనంతరం జీవిత కాలంలో తలెత్తే సమస్యలు ఏవైనా ఉంటే ఆ బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు.
అలాగే కంపెనీని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు, పరిస్థితులను బట్టి అక్కడ నుంచి కంపెనీని తరలించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనావాసాలకు దగ్గరగా ఎలాంటి కెమికల్ కంపెనీలు అనుమతులివ్వకూడదని, ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్ చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ప్రతిపక్షం మారు మాట్లాడుకుండా నోరు మూయించే విధంగా జగన్ చర్యలు తీసుకున్నారు. తాజాగా యంగ్ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాల్లో ఇంటికి ఒకరికి చొప్పున అవసరమైతే సచివాలయంలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు, పాలోవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకతన్నా గొప్ప సీఎంను చూడగలమా? అంటూ జగన్ ని ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనను ఉద్దేశించి జై జగన్ అంటూ..పేదవాడి సీఎం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల ట్వీట్లు వర్షం కురుస్తోంది. అటు యంగ్ సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నేర వేర్చుకుంటూ వెళ్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా..ఆ బురద తిరిగి వాళ్లే మీదే తూలుతోంది.