WhatsApp: ‘వాట్సాప్’లో డిలీట్ అయిన మెసేజ్ లను చదివేయండిలా !

Read deleted whatsapp messages using third party app WAMR

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ సేవల్లో “WhatsApp” (వాట్సాప్) ఒకటి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ఒక భాగమైంది. మీరు స్నేహితుడికి మెసేజ్‌లు పంపాలన్న, కుటుంబ సభ్యులతో గ్రూప్ చాట్‌ చేయాలనుకున్నా, వాట్సాప్‌ బాగా అనువుగా ఉంటుంది. పెరుగుతన్న జనాదరణ కారణంగా, వాట్సాప్ అనేక కొత్త ఫీచర్‌ లను ప్లాట్‌ఫామ్‌ కు పరిచయం చేస్తోంది. ఇందులో మల్టీ-డివైస్ సపోర్ట్ మరియు సందేశాలను డిలీట్ చేయటం లాంటి కొత్త ఫీచర్స్ యూజర్లను ఆకట్టుకున్నాయి.

చాలా కాలం క్రితం, వాట్సాప్ పంపిన మెసేజ్ లను రిసీవర్ చదవడానికి ముందే వాటిని తొలగించే విధంగా ఆప్షన్ పెట్టింది. మీరు మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు పొరపాటు చేసినా లేదా తప్పు మెసేజ్ పంపినా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇది రిసీవర్‌ లో ఏమి పంపబడిందో అన్న కుతూహలం సాధారణం కంటే ఎక్కువగా కలిగిస్తుంది. ఆ మెసేజ్ ఏమై ఉంటుందో అని, తెలుసుకోవాలని తపిస్తుంటారు. అయితే ఒక థర్డ్ పార్టీ ఆప్ తో వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను కూడా చూడొచ్చని చాలామందికి తెలియదు.

Read deleted whatsapp messages using third party app WAMR

ఈ ఆప్ పేరు “WAMR”. ప్లే స్టోర్ లో ఇది ఫ్రీగా దొరుకుతుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ విభాగంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదే పనిని చేసే మరికొన్ని అప్స్ ఉన్నప్పటికీ WAMR మాత్రమే బాగా పనిచేస్తుంది. మొదటిగా ప్లే స్టోర్‌ వెళ్లి, మీ ఫోన్‌లో WAMRని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఓపెన్ చేసి షరతులను చదివి, అంగీకరించండి. ఆ తర్వాత మీరు పర్యవేక్షించాలనుకుంటున్న అప్స్ లను ఎంచుకోమని అడుగుతుంది. వాట్సాప్ తో పాటుగా మీకు కావాలంటే మీరు ఉపయోగించే ఏవైనా ఇతర మెసేజింగ్ అప్స్ ను జాబితా నుండి ఎంచుకోండి.

నెక్స్ట్ స్టెప్ లో సెటప్ పేజీలో నోటిఫికేషన్ రీడర్ ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి. దీని తర్వాత మీ మొబైల్ లోని నోటిఫికేషన్ యాక్సిస్ సెట్టింగ్స్ లో కి వెళ్ళాక WAMR అప్ కి నోటిఫికేషన్ యాక్సిస్ కి అనుమతివ్వండి. అనుమతించాక తిరిగి WAMR అప్ లో కి వెళ్లి నెక్స్ట్ బటన్ ని టచ్ చేస్తే అప్ పనిచేయటం స్టార్ట్ చేస్తుంది. అప్పటినుండి ఎవరైనా మీకు మెసేజ్ పంపాక మీరు చదివేలోపు డిలీట్ చేస్తే WAMR ఆ మెసేజ్ ని రిస్టోర్ చేసి నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి WAMR అప్ లో ఆ డిలీట్ అయిన మెసేజ్ ని మీరు చూడొచ్చు. ఆ మెసేజ్ లను చదివి స్నేహితులకు సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చుడండి.