ప్రస్తుత కాలంలో సొంత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలో కరోనా విజృంభించడం వల్ల సామూహికంగా బస్సు, రైలు వంటి వాటిలో ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. అందువల్ల కారులో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే కారు కూడా అద్దెకు తీసుకోవడం కన్నా ఒక సొంత కారు ఉంటే మంచిదని భావించి వారికి ఉన్నంతలో తీసుకొని మరి కారులో కొనుగోలు చేస్తున్నారు. ఇలా సంతకాలు ఉండటంవల్ల అవసరమైన సమయంలో ఉపయోగపడటమే కాకుండా గౌరవంగా కూడా ఉంటుందని చాలామంది లోన్ తీసుకుని కార్లు కొనుగోలు చేస్తున్నారు.
అయితే లోన్ ద్వారా కారు కొనుగోలు చేసిన తర్వాత ప్రతినెలా ఈఎంఐ కట్టటానికి చాలా భారంగా ఉంటుంది. దీంతో ఈఎంఐలు కట్టేందుకు అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతున్నారు. అయితే లోన్ తీసుకొని కారు కొన్నవారు ఈఎంఐలు కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి ఇబ్బందులన్నీ తప్పుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
• కారు కొనే ముందు మీ ఆర్థిక స్థితి, ఈఎంఐలు కట్టగలిగే సామర్థ్యం అన్ని బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాత మన ఆర్థిక స్థాయికి తగిన కారుని ఎంపిక చేసుకోవాలి.
• లోన్ తీసుకొని కార్ కొన్నప్పుడు నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. అయితే అలా కట్టేటప్పుడు అవకాశం ఉంటే ఈఎంఐ మొత్తం మీద కొంత మొత్తం అధికంగా చెల్లిస్తే.. లోన్ తొందరగా పూర్తి అవటమే కాకుండా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఇలా ఈ ఎం ఐ మొత్తం మీద కొంత మొత్తం ఎక్కువ డబ్బు చెల్లిస్తే అది అసలుకు జమ అవుతుంది కాబట్టి వడ్డీ భారం తగ్గుతుంది.
• అలాగే కారు కొనాలనుకునేవారు అవకాశం ఉన్నంత వరకూ డౌన్‌పేమెంట్ అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. డౌన్ పేమెంట్ అధికంగా చెల్లించటం వల్ల ఈఎంఐల భారం తగ్గుతుంది.
• అలాగే లోన్ తీసుకొని కారు కొన్న తర్వాత ఖచ్చితమైన తేదీన కాకుండా మీ చేతిలో నగదు ఉన్న సమయంలో లోన్ ప్రీ పేమెంట్ చేయటం వల్ల కూడా కొంతవరకు ఈఎంఐ భారం తగ్గుతుంది. అయితే లోన్ తీసుకునేముందే ప్రీపేమెంట్ ఆప్షన్ ఉందో లేదో పైనాన్షియర్‌ను అడిగి నిర్ధారించుకోవాలి. లేకుంటే లోన్ ప్రీపేమెంట్ చేస్తే వారు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
• ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్ల ఈఎంఇ కట్టటానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.