మనలో చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే పర్సనల్ లోన్ తీసుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తక్కువ వేతనం ఉన్నవాళ్లు పర్సనల్ లోన్ విషయంలో ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారనే సంగతి తెలిసిందే. అయితే 21 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా హీరో ఫిన్ కార్ప్ అదిరిపోయే తీపికబురు అందించింది.
కనీసం 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉండగా రుణ శాతంలో 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. తీసుకున్న రుణానికి వడ్డీ రేటు 12.5 శాతంగా ఉండనుందని తెలుస్తోంది. ఆటోమేటెడ్ రీపమెంట్ ఆప్షన్ కూడా ఉండటంతో సులువుగా లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు హీరో ఫిన్ కార్ప్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందని చెప్పవచ్చు.
21 సంవత్సరాల వయస్సు నిండి 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ లోన్ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. నెలకు కనీసం 15,000 రూపాయల వేతనం పొందుతూ సిబిల్ స్కోర్ కనీసం 600 ఉన్నవాళ్లు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్ఛు. కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, పాన్ కార్డు కలిగి ఉండటం ద్వారా కూడా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని హీరో ఫిన్ కార్ప్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా మాత్రమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు మాత్రమే రుణం పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.