భారతదేశ పౌరులకు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు ఆధార్ లో నమోదు చేయబడి ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నంబరు వంటి డీటెయిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాల్సి ఉంటుంది.
ఒకవేళ UIDAI వెబ్‌సైట్‌లో వుండే డీటెయిల్స్ మన ఆధార్ లో డీటెయిల్స్ ఒకేలా లేకపోతే కార్డ్ రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తప్పుగా జనరేట్ అయిన లక్షల కొద్ది ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తోంది. చాలాకాలం ఆధార్ కార్డు వెరిఫై చేయకపోతే ఆ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా అనే విషయం తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఆధార్ కార్డు అప్డేట్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.
• ఆధార్ కార్డ్ అప్డేట్ చేయటం కోసం ముందుగా www.uidai.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
• ఆ తరవాత మీరు verify Aadhaar number మీద క్లిక్ చేస్తే ఓ కొత్త పేజీ వస్తుంది.
• ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిఆ తరవాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
• మీ ఆధార్ నంబరు సరైనదే అయితే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.