భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆధార్ కార్డు ప్రతి మనిషికి ఒక గుర్తింపు కార్డు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు సంబంధించి ఏ పనులు జరగాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పిల్లలని స్కూల్లో చేర్పించే దగ్గర నుండి హాస్పిటల్ లో వైద్యం పొందే వరకు ఆధార్ కార్డ్ అత్యవసరం. అత్యంత ముఖ్యమైన ఈ ఆధార్ కార్డు జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI ఎప్పటికప్పుడు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇక ఇటీవల ఆధార్ కార్డులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం UIDAI ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్‌లు ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పొందుతారు.
ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయటం :
UIDAI ప్రవేశపెట్టిన ఈ ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటానికి 1947 కి డయల్ చేయాలి. ఈ నెంబర్ కి డయల్ చేసి ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఏ భాష మాట్లాడగలిగిన కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి ఆధార్ కార్డుకి సంబంధించిన సమస్యలను వివరించవచ్చు.
UIDAI హెల్ప్‌లైన్ గురించి సమాచారం ఇస్తున్నప్పుడు ప్రజలు హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, పంజాబీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, బెంగాలీ, ఉర్దూ భాషల్లో ఈ నంబర్‌కు కాల్ వారిని సంప్రదించవచ్చు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు, ఆదివారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ ఆధార్ సంబంధిత సమస్యకు పరిష్కారం పొందవచ్చు.ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడానికి మీరు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇ-మెయిల్ ద్వారా కూడా సహాయం :
హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా, ఇ-మెయిల్ ద్వారా కూడా ఆధార్ కార్డుకి సంబంధించిన ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని UIDAI అందిస్తుంది. ఈమెయిల్ ద్వారా ఆధార్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మీ ఇమెయిల్ ID నుండి ఆధార్ అధికారిక ఇ-మెయిల్ కి మీ ఫిర్యాదు లేదా సూచనను అందించాలి.