ప్రస్తుత కాలంలో మనం ఏ చిన్న పని చేయాలన్న మనం భారతీయ పౌరులుగా గుర్తింపు పొందినటువంటి ఆధార్ కార్డు ప్రతి ఒక్క చోట తప్పనిసరి అయింది.ఏదైనా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా లేదా ఒకచోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయాలన్న పిల్లలను స్కూల్లో చేర్పించాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలా ప్రతి ఒక్క ప్రైవేటు ప్రభుత్వ పనులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మన ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ తెలియజేస్తుంది.
ఈ విధంగా ఆధార్ కార్డు ప్రతి ఒక్క పది సంవత్సరాలకు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తెలియజేసింది.ఇలా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం కోసం గతంలో అప్డేట్ చేసినటువంటి ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా మనం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా ఈ పోర్టల్ ద్వారా అప్డేట్ ఎలా చేయాలో తెలియని వారు దగ్గర్లోని ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లి మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఇక ఆధార్ కార్డులో ఏవైనా లోపాలు ఉన్న లేదా అడ్రస్ మార్పించుకోవాలన్న వెంటనే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని సూచించింది.ఇక పుట్టిన పిల్లలకు ఆధార్ చేయించిన వారు 10 సంవత్సరాల తర్వాత వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ అప్డేట్ లేకపోతే ఎన్నో ప్రభుత్వ పథకాలను కోల్పోవాల్సి వస్తుంది.