యూట్యూబ్ వినియోగదారులకు గుడ్ న్యూస్..?

ae82de8972349fc9ce2097aeb29449f301869be5

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది . ఈ క్రమంలో సోషల్ మీడియా ఆప్స్ ఒక దానికి మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ లో ఒకటిగా నిలిచిన యూట్యూబ్ తాజాగా తన వినియోగదారుల కోసం మరొక సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో చూడొచ్చు. ఈ తరహా టెక్నాలజీని మొదట నెట్‌ఫ్లిక్స్‌ వీక్షకులకు పరిచయం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్‌ గేమ్‌ను వీక్షకులకు అర్ధమయ్యేలా సబ్‌టైటిల్స్‌ పాటు, స్థానిక భాషల్లో డబ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇక ఇప్పుడు యూట్యూబ్‌ సైతం అదే తరహాలో ఇతర లాంగ్వేజ్‌ వీడియోలను యూజర్లు కూడా తమకి నచ్చిన భాషలో చూడొచ్చు. ఇతర భాషలకు సంబంధించిన వీడియోలు చూడటానికి బాగున్నప్పటికీ భాష అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో యూట్యూబ్‌ అందించే కొత్త ఫీచర్‌ సాయంతో ఇతర దేశాలకు సంబంధించిన భాషలను కూడా మనకి అర్ధమయ్యే భాషలో డబ్ చేసుకునే అవకాశాన్ని యూట్యూబ్ కల్పించనుంది.

ప్రస్తుతం యూట్యూబ్ ప్రవేశపెట్టనున్న ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. అతి తొందరలోనే ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టనుంది. ఇక ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసేందుకు సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన భాషలో ఆడియో వినిపిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.