ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ఉపయోగించే వారి సంఖ్య రోజుకి పెరుగుతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులకు అనేక సేవలు అందిస్తోంది. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇప్పటికీ ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సప్ ఇటీవల సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ప్రైవసి, స్టేటస్, ప్రొఫైల్, చాట్ విషయంలో కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకువచ్చిన వాట్సాప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్ ని ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదివరకు వాట్సాప్ లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ కి ఒకే రకమైన రింగ్ టోన్ ఉండేది. కానీ ఇప్పుడు వాట్సాప్ లో ప్రతి కాంటాక్ట్ కి, అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఈ సరికొత్త ఫీచర్ ని ఉపయోగించటానికి మీరు ఎవరి కాంటాక్ట్ కి అయితే రింగ్ టోన్ సెట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ను సెలెక్ట్ చేసి,ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
• ఆ తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
• ఆ తర్వాత మీకు ఇష్టమైన రింగ్ టోన్ ని ఎంపిక చేసుకోవాలి.
• మీరు ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న వ్యక్తిని మీ కాన్వర్జేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, వారి పేరుపై క్లిక్ చేయాలి.
• కింద మెనూ నుంచి వాల్‌పేపర్ & సౌండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి , ఆ తర్వాత దాని కింద కస్టమ్ టోన్ బటన్ క్లిక్ చేసి, అలర్ట్ టోన్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన రింగ్ టోన్ ను సెట్ చేసుకోవాలి.
• అలాగే గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేయటానికి కూడా ఇదే పద్దతి అనుసరించాలి.
• అయితే ఐఫోన్ వినియోగదారులకు మాత్రం గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేసుకొనే అవకాశం లేదు.