వాట్స్అప్ యూజర్స్ కి గుడ్ న్యూస్… వాట్సప్ లో కాల్‌ షెడ్యూల్‌ సేవలు..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా చాటింగ్, షేరింగ్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ వంటి ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా వాట్స్అప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ లో గ్రూప్ చాటింగ్, గ్రూప్ కాలింగ్‌ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా కాల్‌ షెడ్యూల్‌ ఫీచర్‘ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను షెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే.. వాట్సాప్‌ గ్రూప్‌లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో/ వీడియో కాల్‌ వెళ్లాలో ముందుగానే సెట్‌ చేసుకోవచ్చన్నమాట. ఇప్పటివరకు కాల్‌ షెడ్యూల్‌ ఫీచర్ అనేది.. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ ఫామ్స్ లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై వాట్సాప్ లో కూడా కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆన్ లైన్ మీటింగులు నిర్వహించే వారికి ఈ కాల్ షెడ్యూల్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

• వాట్సాప్ లో కాల్ షెడ్యూల్ చేయడానికి ముందుగా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి.. వీడియో/ఆడియో కాల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయగానే షెడ్యూల్‌ కాల్ అని పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది.
• అందులో మీరు నిర్వహించాలనుకున్నా మీటింగ్ పేరు, తేదీ, సమయం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.
• వివరాలన్నీ నమోదు చేశాక క్రియేట్ పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. ఇక కాల్‌ ప్రారంభమైన వెంటనే గ్రూపు సభ్యులందరికీ అలర్ట్‌ నోటిఫికేషన్‌ వెళుతుంది.
• ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. .