ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వారందరూ కూడా వాట్సాప్ తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎన్నో ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లో ఉన్న ఈ ఫీచర్స్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూ ఇతర మెసేజింగ్ యాప్స్ కి గట్టి పోటీగా నిలుస్తోంది. ఇక తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరొక కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
సాధారణంగా వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ లకు అయితే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు. వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్ వల్ల ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితోనైనా సులభంగా మెసేజ్ చేయడానికి మనకు సహాయపడుతుంది. ప్రస్తుతం వాట్సాప్ లో కొన్ని పదుల సంఖ్యలో భాషా ఎంపికలు ఉన్నప్పటికీ మనం కేవలం రెండు లేదా మూడు భాషలను మాత్రమే ఉపయోగిస్తున్నాం. వాటిల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ వంటి భాషలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే వాట్సప్ ప్రవేశ పెట్టిన ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా ఇతర భాషా మాట్లాడే వారితో మనం వారి భాషలోనే మాట్లాడవచ్చు. మనకు వారి భాష రాకపోయినా కూడా మనం వారి భాషలో మెసేజ్ చేయవచ్చు. అయితే ఇలా ఇతర భాషలలో మాట్లాడానికి మన ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. వాట్సప్ లో ఇతర భాషల్లో చాటింగ్ చేయటానికి ముందుగా మీరు మెసేజ్ పంపాలి అనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేసి చాట్ విండోను ఓపెన్ చేయాలి. చాట్ బాక్సులో మీకు వచ్చిన భాషలో మెసేజ్ ని టైప్ చేసి దానిని మొత్తం సెలెక్ట్ చేయాలి. వెంటనే మీకు ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. ఆ పాప్ అప్ విండోలో ట్రాన్స్ లేటింగ్ అని ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకొని, ఏ భాషాలోకి ట్రాన్స్ లేట్ కావాలో మీకు కనిపిస్తున్న లిస్ట్ నుంచి దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఆ భాషలోనికి మీ మెసేజ్ మారిపోతుంది. ఆ తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మీరు పంపాలనుకున్న వ్యక్తికి వారి భాషలోనే మెసేజ్ వెళ్లిపోతుంది.