ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది. అది ఎంతలా అంటే ప్రతి ఒక్కరూ మొబైల్ రూపం లో ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంతకు మునుపు ఏదైనా మెసేజ్ చేయాలి అంటే మెసేజ్ బ్యాలన్స్ అని ఒకటి సపరేట్ గా రీఛార్జ్ చేసుకోవలసి వచ్చేది. అలాగే ఫోటో లేదా వీడియో పంపాలి అంటే MMS అనేది ఉండేది. అయితే వీటన్నింటికీ సమాధానంగా వాట్సప్ వచ్చింది. మొబైల్ కొన్న వెంటనే నిమిషం ఆలోచించకుండా ఇన్స్టాల్ చేసే యాప్ ఏదైనా ఉందా అంటే అది వాట్సప్ అనే చెప్పవచ్చు. ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడైనా కేవలం మొబైల్ డేటా తోనే మెసేజ్, ఫోటో, వీడియో, వీడియో కాల్ ఇలా అనే ఫ్యూచర్స్ ఉంటాయి ఇందులో.
ఈ నేపథ్యంలో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కొత్తగా వన్ టచ్ వీడియో ఫ్యూచర్ ని అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థ. అది ఏమిటంటే వీడియో మోడ్ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా వీడియోని యాప్ నుండే తీసి పంపచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూసర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంతకు ముందు ఏదైనా వీడియో షేర్ చేయాలి అంటే కెమెరా నుండి రికార్డ్ చేసి ఆ వీడియోని అటాచ్ చేసేవారు. లేదా ట్యాప్ అండ్ హోల్డ్ ఉపయోగించి వీడియో షేర్ చేసేవారు.
ఈ ఫ్యూచర్ ని ఇదివరకు వాట్సాప్ లో ఫోటో షేర్ చేయడానికి ఏ టాప్ ఉపయోగించే వారో దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అండ్ వీడియో రెండు టాప్స్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత కనిపిస్తాయి. మీకు ఏ మోడ్ కావాలో ఫోన్ ని స్వైప్ చేసి మార్చుకోవచ్చు. దీని కోసం వాట్సాప్ కొన్ని ప్రత్యేక బగ్ లను రూపొందించింది. ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.2.73 అప్డేట్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ని మీ మొబైల్ లో పొందాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ యాప్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం మొదలై రెండు నెలలు పూర్తి అవ్వకముందే వాట్సప్ ఈ సంవత్సరంలో అనేక కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెచ్చి ఏ ఇతర యాప్ లకు లేని జనాకర్షణ ను పొందింది.