వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్… అందుబాటులోకి మరి కొత్త ఫీచర్… ఇక పై గ్రూప్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు!

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఇలా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకున్నటువంటి వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూ వినియోగదారులను సందడి చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ తాజాగా గ్రూప్స్ విషయంలో మరొక ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ కొత్త ఫీచర్ ఏంటి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…

ఇప్పటికే వాట్సాప్ గ్రూపులకు సంబంధించి ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ వారు తాజాగా గ్రూప్ కి సంబంధించి మరో ఫీచర్ ని తీసుకువచ్చారు. ఎక్స్‌పైరింగ్ గ్రూప్‌ అనే పేరుతో వాట్సాప్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.సాధారణంగా ఏదైనా గ్రూప్ క్రియేట్ చేస్తే మనం ఆ గ్రూప్ డిలీట్ చేసే వరకు కూడా అలాగే ఉండిపోతుంది అయితే తాజాగా వచ్చిన ఈ ఫీచర్ ద్వారా మనం క్రియేట్ చేసిన గ్రూప్ ఎప్పటి వరకు ఉండాలి అనే విషయాన్ని ముందుగా సెట్ చేసి పెట్టడం వల్ల ఆ తేదీకి గ్రూప్ డిలీట్ అవుతుంది.

ఇలా తాత్కాలిక గ్రూప్ సెట్టింగ్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ ఫ్యూచర్ టెస్టింగ్ దశలోనే ఉంది త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త ఫ్యూచర్ వినియోగదారుల దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తుంది అలాగే వినియోగదారులను తప్పకుండా మెప్పిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.