వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్..వాట్సాప్‌ లో డ్రాయింగ్ టూల్‌కు మరిన్ని ఆప్షన్స్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ని తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నా కూడా పోటీని తట్టుకొని నిలబడటానికి ఎప్పటికప్పుడు సరికొత్త టీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూ నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పటికే ఎన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరోక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.

ఈ ఫీచర్ వాట్సాప్ లోని డ్రాయింగ్ టూల్‌కు మరిన్ని కొత్త ఆప్షన్లను అందించనున్నట్లు వాట్సప్ వెల్లడించింది. ఇప్పటికే iOS కోసం టెస్ట్‌ఫ్లైట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ తాజా బీటా అప్‌డేట్‌లో డ్రాయింగ్ టూల్ కోసం టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్‌పై ఈ సర్వీస్ ఇటీవలే పనిచేస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. త్వరలో రాబోయే, ఈ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్, డ్రాయింగ్ ఎడిటర్ యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫాంట్‌లు మరియు సాధనాలను వాట్సప్ తీసుకువస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక ట్యాప్‌తో టెక్స్ట్ యొక్క ఫాంట్‌లను మార్చడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ అయిన ఈ WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ కొత్త టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది వాట్సాప్ లోని డ్రాయింగ్ టూల్‌కు కొత్త ఫాంట్‌లు మరియు టెక్స్ట్ ఫార్మాటింగ్‌ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కీబోర్డ్‌లో ఉన్న ఎంపికలను నొక్కడం ద్వారా మనం మనకు నచ్చిన ఫాంట్‌లను సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరియు వినియోగదారులు వ్యాఖ్యలు సమలేఖనాన్ని, అలాగే ఫోటోలు, వీడియోలు మరియు GIFలలో ఫార్మాట్ టెక్స్ట్‌ను కూడా మార్చే వీలు కూడా ఉంటుంది. అంతె కాకుండా అదనంగా, వినియోగదారులు మెసెజ్ రంగును కూడా మార్చే అవకాశాన్ని కల్పించనుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.