స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రోజురోజుకీ వాట్సప్ ఉపయోగించే వారి సంఖ్య అధికమవుతుంది.అయితే యూజర్లను ఆకట్టుకోవడం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక అద్భుతమైన ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్ల ముందుకు వచ్చింది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మెసేజింగ్ యాప్ యూజర్లకు కొత్త అప్డేట్ ఇచ్చింది. కొత్త అవతార్ ఫీచర్ ను ఉపయోగించి ఇప్పుడు మీరు మీ స్వంత యానిమేటెడ్ అవతార్లను తయారు చేసుకోవచ్చు.
ఈ అవతార్లను 3d యానిమేటెడ్ రూపంలో మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మరి వాట్సాప్ లో అవతార్ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…ముందుగా వాట్స్అప్ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్నటువంటి మూడు చుక్కలను క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి సెట్టింగ్ ఓపెన్ చేయగానే అవతార్ ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ అవతార్ సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అవతార్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చినట్టుగా 3d అనిమేటెడ్ క్రియేట్ చేసుకోవచ్చు.
అవతార్ కోసం స్కిన్ టోన్ని ఎంచుకోవచ్చు. టోన్ని ఎంచుకున్న తర్వాత “నెక్స్ట్” క్లిక్ చేయండి. దానిని అనుసరించి, మీరు మీ హెయిర్ స్టైల్ మీ రంగు లేదా స్కిన్ టోన్ ఇలా వేటినైనా ఎంచుకొనిడన్ అనే బటన్ పై క్లిక్ చేస్తే అవతార్ క్రియేట్ అయినట్లే దీనిని మీరు మెసేజ్ గా ఇతరులకు ఫార్వర్డ్ చేయవచ్చు లేదా మీ ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ అవతార్ యాప్ ఇదివరకు ఫేస్బుక్ స్నాప్ చాట్ వంటి వాటిలో ఉండేది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.