ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వారికి హెల్మెట్ ఎంత అవసరం ఉంటుందో అందరికీ తెలిసింది. ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు జరిగే ప్రమాదాల నుండి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది. అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది. అయితే ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫోన్ మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల చాలమంది హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా హెల్మెట్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఇటీవల మార్కెట్లోకి బ్లూటూత్ కనెక్షన్ కలిగిన సరికొత్త హెల్మెట్ వచ్చింది.
హెల్మెట్ లోపల, చెవి దగ్గర రెండు చిన్న స్పీకర్లను మరియు నోటి దగ్గర ఒక చిన్న మైక్ జతచేయబడి ఉంటుంది. అలాంటి రెండు హెల్మెట్‌లు బ్లూటూత్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడితే, ఇద్దరూ ఇంటర్‌కామ్ లాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు..
ఈ సరికొత్త బ్లూటూత్ హెల్మెట్‌ను మొబైల్‌కి కనెక్ట్ చేసి హెల్మెట్ తీయకుండానే ఫోన్ కాల్ మాట్లాడవచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ, ఫోన్ వచ్చిన తర్వాత ఆ కాల్ అటెండ్ చేసి అవతల వారికి మీరు డ్రైవింగ్ లో ఉన్న విషయాన్ని చెప్పటానికైనా కాల్ అటెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు తప్పక మాట్లాడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ హెల్మెట్‌లోని బ్లూ టూత్ కి మీ మొబైల్‌ను కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్ కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా మీరు మ్యూజిక్ ను కూడా ఎంజాయ్ చేయొచ్చు.
అలాగే బైకర్ గ్రూప్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా ఈ హెల్మెట్ చాలా ఉపయోగ పడుతుంది. ఈ సరికొత్త బ్లూటూత్ హెల్మెట్ ద్వారా 6 వ్యక్తులను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు . అంతే కాకుండా ఇంటర్‌కామ్ లాగా మాట్లాడవచ్చు. 800 నుండి 1200 మీటర్ల పరిధిలో ఉన్న వారిని ఈ బ్లూటూత్ హెల్మెట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. బొగోట్టో కంపెనీకి చెందిన ఈ బ్లూటూత్ హెల్మెట్ ధర రూ.14800. ఒకవేళ కేవలం హెల్మెట్ కోసం మీరు ఇంత మొత్తం ధర వెచ్చించలేని సమయంలో మీరు మీ సాధారణ హెల్మెట్ కోసం బ్లూటూత్ ఇంటర్‌కామ్ పరికరాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంటర్‌కామ్ పరికరం ధర కేవలం రూ.2500 మాత్రమే ఉంటుంది. ఈ బ్లూటూత్ హెల్మెట్ ద్విచక్ర వాహనదారులకు చాలా ఉపయోగపడుతుంది.