ఓటర్ కార్డ్ వెంట తీసుకెళ్లకుండ మీ మొబైల్ లోనే డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండిలా..?

దేశంలో ఓటు హక్కు అర్హత కలిగిన ప్రతి పౌరునికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను అందజేస్తోంది. ఈ ఓటరు గుర్తింపు కార్డు కేవలం ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. దీనిని పౌరుని యొక్క గుర్తింపు కర్డుగా పరిగణిస్తారు. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. కొన్ని సందర్భలలో ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అత్యవసర పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అయితే ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్, పాన్ కార్డు వంటి ఇతర గుర్తింపు కార్డుల మాదిరిగా ఓటర్ కార్డ్ డిజిటల్ కాపీ ఇప్పుడు మీ మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ కాపీని ఉంచుకుని అవసరం సమయాలలో సులభంగా వినియోగించుకోవచ్చు. అంతే కాకుండా ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా. అయితే భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆన్లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ చేయటం :

• డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేయటానికి ముందుగా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
• ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
• వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
• మీ ఓటర్ వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
• ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
• ఆ తరువాత ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
• ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
• నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.