మీ మొబైల్ నంబర్ చివరి సంఖ్య ఇదే అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే..!

ఈ రోజుల్లో మన జీవితంలో మొబైల్ ఫోన్‌ ఒక భాగమైపోయింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. మీ మొబైల్ నంబర్‌ మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందేమో అని! అవును… సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, మీ మొబైల్ నంబర్ చివరి అంకె మీ జీవితం, మీ ఆలోచనలు, మీ విజయానికి కూడా సంబంధించిన సంకేతాలు ఇస్తుందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నట్లుగా, మొబైల్ నంబర్‌లోని ప్రతి అంకెకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కానీ మొత్తం 10 అంకెలను మార్చడం సాధ్యం కాకపోవడంతో, నిపుణులు ప్రధానంగా చివరి నాలుగు అంకెలను లేదా చివరి ఒక అంకెను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఆ అంకెలే మన ఫోన్ వైబ్రేషన్స్‌, మనకున్న అవకాశాల దిశను నిర్ణయిస్తాయని వారు అంటున్నారు.

ఇప్పుడు మీ మొబైల్ నంబర్ చివరి అంకె ఏమి చెబుతుందో చూద్దాం. 0తో ముగిసే నంబర్ ఉన్నవారికి… కొత్త ఆరంభాలు కష్టంగా ఉంటాయని, సాధించిన ఫలితాలు నిలకడగా ఉండవని అంటారు. కాల్స్ ఎక్కువగా వచ్చినా ఫలితం తక్కువగా ఉంటుంది. ఇక ‘1’ అంటే లీడర్‌షిప్‌, సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం. కానీ కొన్ని ప్రాజెక్టులు చివరి నిమిషంలో ఆగిపోవచ్చని సూచన. ‘2’ ఉన్నవారికి భావోద్వేగ బంధాలు బలంగా ఉంటాయి. ఈ నంబర్ ఉన్నవారికి స్నేహితులు, సంబంధాలు ఎక్కువగా ఏర్పడతాయి.

‘3’ అంటే కమ్యూనికేషన్‌, సృజనాత్మకతకు సంకేతం. మీడియా, విద్యా రంగాల్లో ఉన్నవారికి ఇది అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘4’ ఉన్నవారికి క్రమశిక్షణ, స్థిరత్వం ఉంటుంది. కానీ వీరి చుట్టూ ఉన్నవారు తరచుగా బేరసారాలు చేసే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ‘5’ నంబర్ ఫ్లెక్సిబుల్‌, బహుముఖ ప్రతిభ కలిగినవారికి సరిపోతుంది. వ్యాపారాలకు ఇది లాభదాయకమైన అంకె.

‘6’ అంటే కుటుంబం, సమతుల్యత. కానీ వ్యాపారంలో 6 ఉన్న నంబర్లు కొంత బేరసారాలు ఎదుర్కొంటారని సూచన. ‘7’ అంటే ఆత్మపరిశీలన, ఆధ్యాత్మికత. ఈ నంబర్ ఉన్నవారు లోతైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. ‘8’ నంబర్ సంపద, విజయం, శక్తి హారకంగా భావిస్తారు. కానీ దానికి కష్టపడి పనిచేయడం తప్పనిసరి. ‘9’ అంటే నాయకత్వం, మానవతావాదం, దాతృత్వం. ఈ నంబర్ ఉన్నవారి చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది.

కేవలం చివరి అంకె మాత్రమే కాకుండా, మొబైల్ నంబర్ మొత్తం అంకెలను కలిపి వచ్చే ఫలితాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మొత్తాన్ని ఒకే అంకెకు తగ్గించి, అది మన జన్మతిథి నంబర్తో సరిపోతే… ఆ మొబైల్ నంబర్‌ను “అదృష్ట నంబర్ గా పరిగణిస్తారు. ఉదాహరణకు, మీ మొబైల్ నంబర్‌ అంకెల మొత్తం 23 అయితే → 2+3 = 5 అవుతుంది. ఇక మీ జన్మతిథి 14 అయితే → 1+4 = 5 అవుతుంది. రెండూ 5 కావడంతో ఇది మీ అదృష్ట సంఖ్య అవుతుంది. ఇలాంటి కాంబినేషన్లు వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయని నమ్మకం.

ఇక న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నదేమిటంటే “మొబైల్ నంబర్ కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్ లాంటిదే. అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సరైన అంకెల కలయికతో ఉన్న నంబర్, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తప్పు నంబర్ అయితే మన ఫ్రీక్వెన్సీ తగ్గి, పనులు సజావుగా జరగకపోవచ్చు. ఇక సోషల్ మీడియాలో చాలా మంది తమ మొబైల్ నంబర్లను న్యూమరాలజీ ప్రకారం విశ్లేషించుకుంటూ, కొత్త నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు దాంతో తమ అదృష్టం నిజంగా మారిందని కూడా చెబుతున్నారు.