ట్విట్టర్ వినియోగదారులకు శుభవార్త..ఇకపై ట్విట్టర్ లో డిజిటల్ పేమెంట్స్…?

Twitter Again Did A Blunder Against India

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల కష్టపడకుండానే అన్ని పనులు పూర్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అందరి స్మార్ట్ ఫోన్ లో ఇప్పుడు ఫోన్ పే,గూగుల్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేయటం ఇప్పుడు చాలా సులభం. ఇలా ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఏ తో పాటు వాట్సప్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. ఇటీవల వాట్సప్ పేమెంట్ విధానాన్ని వాట్సప్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తరహా లోనే ట్విట్టర్ కూడా డిజిటల్ పేమెంట్స్ చేయటానికి సిద్ధపడుతుంది. గతంలో కూడా ఒకసారి ఈ విషయం గురించి చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో ట్విట్టర్ సీఈఓ మాస్క్ ఈ విషయాన్ని తోసిపుచ్చాడు.

ఇదిలా ఉండగా మస్క్ ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ పరిస్థితి.o చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దీంతో చాలామంది ట్విట్టర్ ఉద్యోగులను కూడా తొలగించారు. ఇప్పుడు వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన పనికి ట్విట్టర్ కి ఎడ్వటైజ్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయింది. దీంతో ట్విట్టర్ ప్రతినిధులు ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి చూపుతున్నారు. దీంతో గతంలో లాగా మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు ఫీచర్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు అనే అంశం తెర పైకి వచ్చింది.

ట్విట్టర్ లో ప్రొడెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్తేర్ కాఫోర్డ్ ట్విట్టర్ లో పేమెంట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తల గురించి ట్విట్టర్ ప్రతినిధులు ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. అంతే కాకుండా గతంలో ట్విట్టర్ ను ది ఎవ్రీ థింగ్ యాప్ గా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అందువల్ల భవిష్యత్ లో ట్విట్టర్ లో పేమెంట్ ఫీచర్ ను కచ్చితంగా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ట్విట్టర్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. ట్విట్టర్ లో పేమెంట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావటం వల్ల కంపెనీ కి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని ప్రజల వాదన.