రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో ప్రత్యేకమైన పథకాలు అమలులోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిన వాటిలో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 6000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ 12 విడతల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే 13వ విడత పిఎం కిసాన్ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది.
ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 15వ తేదీలోగా పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 13వ విడతలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలు చొప్పున డబ్బులను జమ చేయనున్నారు. ఏడాదికి 6000 రూపాయలు చొప్పున మూడు విడుదలగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాలో జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే ఈకేవైసీ పూర్తిచేసుకుని ఉంటారో అలాంటి వారి ఖాతాలోకి మాత్రమే ₹2000 జమ కానున్నాయి. ఇలా ఈ కేవైసీ చేయని పక్షంలో వారి ఖాతాలో 2000 రూపాయలు జమ కావని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఈ కేవైసీ చేయించుకోవడం కోసం దగ్గర్లోని ఆధార్ సెంటర్ కి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి.అయితే జనవరి 15లోగా రైతుల ఖాతాలో 2000 రూపాయల జమ కానున్నాయని తెలియడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.