సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్….ఎఫ్ డీ వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఎల్!

సాధారణంగా వృద్ధులు తమ డబ్బును బ్యాంకులో దాచుకోవడం వల్ల వారికి ఎఫ్ డి వడ్డీ రేట్లు అధికంగా చెల్లిస్తూ ఉంటుంది.అందుకే వృద్ధులు ఎక్కువగా తమ డబ్బును బ్యాంకులో దాచుకోవడానికి ఆసక్తి కనపరుస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబై బేస్డ్ బ్యాంక్ అయినటువంటి ఆర్బిఎల్ మరోసారి ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులను సవరణ చేసింది. ఇదివరకు టెన్యూర్‌ ఆధారంగా కనిష్ఠంగా 3.75 శాతం నుంచి గరిష్ఠంగా 8.05 శాతం వరకు వడ్డీ లభించేది.

ప్రస్తుతం ఈ వడ్డీరేట్ల సవరణలో భాగంగా సీనియర్ సిటిజెన్లకు గరిష్ఠ వడ్డీ రేటు 8.8 శాతానికి పెరిగింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చాయి. సీనియర్‌ సిటిజన్లు 453 రోజుల నుంచి 725 రోజులలోపు చేసిన రూ.2 కోట్ల లోపు మొత్తానికి 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా 12 నెలల నుంచి 15 నెలలలోపు టెన్యూర్‌కి, 726 రోజుల నుంచి 60 నెలల వ్యవధికి 7.50 శాతం వడ్డీ అందిస్తోంది.

ఇకపోతే ఆర్‌బీఎల్‌ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో సీనియర్ సిటిజన్‌లు సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీ చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ అదనపు పొందడానికి 80 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అర్హులు.అయితే ఈ సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లు నాన్ రెసిడెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తించదు. అదేవిధంగా 80సీ కింద ట్యాక్స్‌ సేవింగ్‌ కోసం చేసే రూ.1.5లక్షలలోపు ఎఫ్‌డీలను ముందుగా క్లోజ్‌ చెయ్యడం కుదరదు. ఐదేళ్లకు చేస్తే ఐదేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే క్లోజ్ చేసే వెసులుబాటు ఉంటుంది.