సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ అదిరిపోయే పథకాలను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే సీనియర్ సిటిజన్లకు అన్ని బ్యాంకులు ఒకింత ఎక్కువ మొత్తం వడ్డీని అందిస్తుండటం గమనార్హం. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
పై ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వార్షిక వడ్డీరేటు అందిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. 80,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత ఏకంగా రూ.86,002 పొందే అవకాశం ఉంది. డిపాజిట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తం మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు.
మూడేళ్ల పాటు రూ.3.6 లక్షలు ఎఫ్‌డీ చేస్తే రూ.76,975 వడ్డీ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రూ.3.6 లక్షలు ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత ఏకంగా వడ్డీ రూ.1,61,981 పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ కొన్ని స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండగా 400 డేస్ అమృత్ కలాష్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా ఒకటి.
ఈ స్పెషల్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి 7.60 వరకు వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.