సీనియర్ సిటిజన్లకు మేలు జరిగేలా కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం సైతం వృద్ధులకు ప్రయోజనం చేకూరేలా కీలక పథకాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అటల్ వయో అభ్యుదయ యోజనపేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ తో భారీగా బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంది.
ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు వైద్య సదుపాయాలను కల్పించడంతో పాటు వృద్ధులకు అవసరమైన వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. వృద్ధుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. మన దేశ పౌరులు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పిల్లలు లేని పిల్లలు ఉన్నా ఇంటినుంచి బయటికి వచ్చేసిన వృద్ధులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ప్రాథమిక చిరునామా రుజువు, ఆరోగ్య సమాచార పత్రాలు సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కోసం త్వరలో ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుంది.
ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అప్పటివరకు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఈ స్కీమ్ ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తెస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ సిటిజన్ల కోసం ఎక్కువ సంఖ్యలో స్కీమ్స్ అందుబాటులోకి రావాల్సి ఉంది.