పదవీ విరమణ తర్వాత సరైన ఆదాయం ఉండాలని మనలో చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. సంపాదించి దాచుకున్న డబ్బు మొత్తాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఫీలవుతారు. అయితే సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరేలా సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు ఏకంగా 20000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఆధారంగా పొందే మొత్తంలో మార్పులు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఈ స్కీమ్ లో 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2,46,000 రూపాయలు వార్షిక వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా తెలుసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కు సంబంధించి సందేహాలు ఉంటే బ్యాంక్ అధికారులను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వల్ల లాభమే తప్ప నష్టం లేదు.