దేశంలో ఉన్న దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎస్బిఐ ఎన్నో సేవలను అందిస్తుంది. ప్రజల అవసరాలను బట్టి కొత్త కొత్త పథకాలను అమలులోకి తీసుకువస్తుంది. అయితే ఇటీవల ఎస్బిఐ తన కస్టమర్లకు మరొక శుభవార్త తెలియజేసింది. ఎస్బిఐ ఖాతాదారులు తమ అకౌంట్ నుండి డబ్బులు పొందటానికి బ్యాంక్ ఎటిఎం కి వెళ్లాల్సిన పని లేకుండా ఇంటికి డబ్బులు వచ్చే విధంగా కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా వృద్ధులు వికలాంగులు ఎంతో ప్రయోజనం పొందుతారు.
ప్రస్తుత కాలంలో చాలామంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. అటువంటి సందర్భాలలో డబ్బు కోసం దగ్గరలోని ఏటీఎం కి వెళ్ళాలి… లేదంటే బ్యాంకు కి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వృదుల్లు, వికలాంగులు ఇలా డబ్బు కోసం ప్రతిసారీ బ్యాంక్ , ఏటీఎం కి వెళ్లాల్సిన అవసరం ఇంట్లో కూర్చుని డబ్బులని పొందొచ్చు. ఇంట్లో కూర్చుని డోర్‌స్టెప్ సర్వీసు ద్వారా కావలసినంత డబ్బులని పొందవచ్చు. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సర్వీస్ సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బును ఈజీ గా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సదుపాయాన్ని పొందేందుకు ఎస్బిఐ కస్టమర్‌లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వికలాంగులకు నెలలో మూడు ట్రాన్సక్షన్స్ ని ఉచితంగా చేసే అవకాశం కల్పించింది. అయితే మూడు కంటే ఎక్కువసార్లు డబ్బు విత్ డ్రా చేసుకునేవారు ఆ సేవలకు రూ.75, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సేవలు పొందటం కోసం మీరు ముందు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడం కోసం మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేసి,
పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్ (పిన్) ఎంటర్ చెయ్యాలి.
ఆ తర్వాత డీఎస్‌బీ యాప్ నుండి ఎస్‌ఎంఎస్ వస్తుంది. అప్పుడు మీరు యాప్‌కి లాగిన్ చేయవచ్చు.